- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.14 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయండి.. కేంద్రమంత్రిని కలిసిన MP చామల
రూ.14 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయండి.. కేంద్రమంత్రిని కలిసిన MP చామల

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర జౌళిశాఖ మంత్రి రిగిరాజ్ సింగ్(Union Minister Giriraj Singh)ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) కలిశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఆఫీస్‌లో భేటీ అయి.. యాదాద్రి జిల్లా పోచంపల్లిలోని హ్యాండ్లూమ్ పార్క్(Pochampally Handloom Park) పునరుద్ధరణకు అవసరమైన రూ.14.00 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ అభివృద్ధి పథకం కింద ఈ నిధులు అవసరమని ఎంపీ పేర్కొన్నారు. గతంలో బ్యాంకుల నుండి తీసుకున్న PMD రుణాల బకాయిల కారణంగా ఈ హ్యాండ్లూమ్ పార్క్ నిర్వీర్యమై వేలానికి వెళ్లిందని తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్‌ను కొనుగోలు చేసి, సంప్రదాయ నేతవృత్తిదారుల జీవనోపాధిని కాపాడుతూ హ్యాండ్లూమ్ కార్యకలాపాలను పునరుజ్జీవింపజేయడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ మరియు అప్పారెల్ ఎగుమతి పార్కుల కమిషనర్, గ్రేటర్ నోయిడాలోని NHDC మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారికంగా లేఖ రాసి, భారత ప్రభుత్వం – జౌళిశాఖ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరినట్లు ఎంపీ తెలిపారు. పోచంపల్లికి ఉన్న అంతర్జాతీయ గుర్తింపు దృష్ట్యా, ఈ నిధులు విడుదలైతే హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరించబడటంతో పాటు స్థానిక నేతవృత్తిదారులకు ఉపాధి కల్పన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం మరియు భారతదేశపు విలువైన హ్యాండ్లూమ్ వారసత్వ పరిరక్షణకు దోహదపడుతుందని ఎంపీ తెలిపారు. నేతవృత్తిదారుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని, చారిత్రక పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా, వేగవంతమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






