మరి మాకు ఓటేస్తావా కేటీఆర్.. మాజీ మంత్రి వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ సెటైర్లు

by Ramesh Naini |

మేము ఎంపీలము ఆందోళన చేస్తే యూరియా వచ్చింది.. మరి ఓటేస్తావా మాకు కేటీఆర్ అని కాంగ్రెస్ నేత, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు.

మరి మాకు ఓటేస్తావా కేటీఆర్.. మాజీ మంత్రి వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎరువుల బస్తా ఇచ్చినొడికే ఓటేస్తా అంటున్నావు పిచ్చోడి లెక్క.. మేము ఎంపీలము ఆందోళన చేస్తే యూరియా వచ్చింది.. మరి ఓటేస్తావా మాకు కేటీఆర్ (KTR) అని కాంగ్రెస్ నేత, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌నీ తట్టుకునే పరిస్థితి నీకు లేదన్నారు. కేటీఆర్.. ప్రెస్‌మీట్‌లు మూడు షో ల లెక్క సాగుతున్నాయని విమర్శించారు. ఉదయం షో.. మధ్యాహ్నం షో.. నైట్ షో లాగా నడుస్తోందన్నారు. ప్రెస్‌మీట్ పెట్టకపోతే కేటీఆర్‌కి పూట గడవడం లేదన్నారు. ఆయన తీరు పతివ్రత పరమాన్నం వండితే.. తెల్లారిందాక చల్లారలేదు అన్నట్టు ఉందని విమర్శలు గుప్పించారు.

పార్టీ ఫిరాయింపుల గురించి కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నావు.. అప్పుడు నువ్వు కూడా ఉప ఎన్నికలకు పోతే.. నీ దమ్ము ఏంటో తెలిసేది? అని నిలదీశారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కూడా తడాఖా చూపిస్తా అంటున్నావు.. అది కూడా తీర్చుతాం.. ఎంత దూరంలో లేదు ఎన్నికలని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డే (CM Revanth Reddy) డెంగ్యూ తెచ్చినట్టు హరీశ్‌రావు (Harish Rao) మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన హయాంలో వందల కేసులు నమోదు అయ్యాయని ఆరోపించారు. నీ హయాంలో డెంగ్యూ పరిస్థితి ఏంటనేది నేషనల్ ఛానల్‌లో స్టోరీలు వేశారని వివరించారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు నైట్ బ్యాట్స్ మెన్ టైప్ అని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్ బీసీలకు పార్టీ పరంగా ఇస్తాం అని బీఆర్ఎస్.. బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగైనా చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు.

Next Story