- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీచర్స్‌కు టెట్ మస్ట్.. పార్లమెంట్‌లో MP చామల కీలక వ్యాఖ్యలు
by Gantepaka Srikanth |
ఉపాధ్యాయుల సమస్యలపై పార్లమెంట్(Parliament)లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ప్రస్తావించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయుల సమస్యలపై పార్లమెంట్(Parliament)లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ప్రస్తావించారు. గురువారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. 2010 ఆగస్టు 23కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు అకస్మాత్తుగా TET పరీక్షను తప్పనిసరి చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. దీని వల్ల లక్షలాది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. TET ఉత్తీర్ణత తప్పనిసరి చేయడం పూర్తిగా అన్యాయం, వారి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని అన్నారు. అలాగే వేలాది సీనియర్ ఉపాధ్యాయుల భవిష్యత్ సంక్షోభంలో పడుతుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధ్యాయుల హక్కులను రక్షించడానికి కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే RTE Act 2009 మరియు NCTE Act 1993 లలో తగిన సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story






