MP Chamala: నన్ను ట్రోల్ చేసి ఫేమస్ చేసింది బీఆర్ఎస్ నాయకులే.. కాంగ్రెస్ ఎంపీ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

నన్ను ట్రోల్ చేసి ఫేమస్ చేసింది బీఆర్ఎస్ నాయకులే అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

MP Chamala: నన్ను ట్రోల్ చేసి ఫేమస్ చేసింది బీఆర్ఎస్ నాయకులే.. కాంగ్రెస్ ఎంపీ హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నన్ను ట్రోల్ (Troll) చేసి ఫేమస్ చేసింది బీఆర్ఎస్ (BRS) నాయకులే అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) హాట్ కామెంట్స్ చేశారు.ఈ మేరకు ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.నేను మాట్లాడిన దాంట్లో కొంత భాగం తీసి ప్రచారం చేస్తున్నారని, నాపై ట్రోల్ చేస్తే భయపడి సైలెంట్ ఉంటానని బీఆర్ఎస్ నాయకులు భ్రమపడుతున్నారని ఫైర్ అయ్యారు. నేను ఒక్కరోజు ప్రెస్‌మీట్ పెడితే బీఆర్ఎస్ సోషల్ మీడియా 3 రోజులు ప్రచారం చేస్తోందని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఏ సంవత్సరం ఎన్ని నీళ్లు వాడారో వివరాలు పట్టుకుని రావాలని సవాల్ చేశారు.

బనకచర్ల ప్రాజెక్టుపై కొన్ని రోజులు డ్రామా చేశారని ఆరోపించారు. (Congress) కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తోందని హరీశ్‌రావు ఏకపాత్రాభినయం చేశారని విమర్శించారు. హరీశ్‌రావు ఏకపాత్రాభినయం పేలలేదు కాబట్టి వినోద్ రావును తెరపైకి తెచ్చారని, బనకచర్ల విషయంలో సీఎం చంద్రబాబును బూచిగా చూపించారని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని అబద్ధాలను ప్రచారం చేశారని ఆరోపించారు. బనకచర్ల, ఆల్మట్టి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వంగా లేదని స్పష్టం చేశారు. కృష్ణా నీళ్లను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే పదేళ్లు (KCR) కేసీఆర్ ఎందుకు సైలెంట్ ఉన్నారు? అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడుకు గండి కొట్టడానికి సహకరించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.

Next Story