మెదడు దొబ్బినట్లుంది.. మీ ప్రధాన శత్రువు బీజేపీనే: ఈటలకు చామల కిరణ్ కౌంటర్

by Ramesh Naini |

బీజేపీ పై ఉన్న ఫ్రస్టేషన్ సీఎం రేవంత్ రెడ్డిపై చూపించడం కరెక్ట్ కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

మెదడు దొబ్బినట్లుంది.. మీ ప్రధాన శత్రువు బీజేపీనే: ఈటలకు చామల కిరణ్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీజేపీ పై ఉన్న ఫ్రస్టేషన్ సీఎం రేవంత్ రెడ్డిపై చూపించడం కరెక్ట్ కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. తాజాగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajender) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈటల రాజేందర్ మీరు కమ్యూనిస్టు భావజాలం ఉండి బీజేపీలోకి వెళ్లారని గుర్తుకు చేశారు. (BJP) బీజేపీలో లెప్ట్‌ వింగ్‌ నుంచి రైట్‌ వింగ్‌కు పోవడం వల్ల మీ రైట్ మెదడు దొబ్బినట్లు ఉంది.. అని సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్‌లో పంచాయతీ పెట్టుకుని బీజేపీలోకి వెళ్లి అక్కడ పరిస్థితి అర్థం కావడం లేదన్నారు.

పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని, సీఎం అయిపోవచ్చనే పిచ్చి ఆలోచనతో ఈటల ఉన్నారని అన్నారు. కానీ బీజేపీలోని సీనియర్ నేతలు ఈటలను లాస్ట్ బెంచ్‌కు పరిమితం చేశారని అన్నారు. ఇవన్నీ ఒత్తిళ్లు తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డిపై వేయడం సరియైనది కాదని సూచించారు. మీ సమస్య అంతా బీజేపీ పార్టీలో ఉంది.. కానీ అది పట్టించుకోవడం లేదన్నారు. ఇక సీఎం రేవంత్‌‌రెడ్డిని తిడితేనే పదవులు వస్తాయని ఈటల భ్రమిస్తున్నారని ఆరోపించారు. మీ అధిష్ఠానం వద్ద మంచి పేరు లేదు.. మీ ప్రధాన శత్రువు బీజేపీనే అని ఎంపీ సూచనలిచ్చారు. ఈటలకు ఏలాంటి ప్రాధాన్యత ఇవ్వొద్దని ఇప్పటికే (BRS) బీఆర్‌ఎస్‌ నుంచి సూచన వచ్చిందని ఎంపీ చామల కామెంట్స్ చేశారు.

Next Story