- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిస్‌వరల్డ్ పోటీలు వాయిదా వేయలేం! ప్రతిష్టను దెబ్బ తీయాలని కవిత చూస్తోంది: ఎంపీ చామల
మిస్ వరల్డ్ (Miss World) కాంపిటీషన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మిస్ వరల్డ్ (Miss World) కాంపిటీషన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఎమ్మెల్సీ కవిత దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. రాజకీయంలో ఉన్నాం కదా అని ఏదో ఒకటి మాట్లాడాలి అన్నా ఆలోచన ఆమెదన్నారు. మిస్‌వరల్డ్ కాంపిటీషన్‌లను పోస్ట్ ఫోన్ చేయడం లేదా రద్దు చేయడం లాంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వానికి చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక ఫెలిసేటేటర్ మాత్రమేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం నేడు చాలా సేఫెస్ట్ ప్లేస్ అని.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టొచ్చని.. తెలంగాణలో ఇంత పెద్ద ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా చూసే ఈవెంట్లను చేయవచ్చని.. ఒక 4, 5 నెలల క్రితం ఈ ప్లేస్ తెలంగాణను సెలెక్ట్ చేశారని తెలిపారు. తెలంగాణ మీద నమ్మకంతో ఇక్కడ ఈవెంట్ పెట్టుకున్నారని అన్నారు. ఈ రోజు మిస్ వరల్డ్ లిమిటెడ్ అనే కంపెనీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఆ కంపెనీ ఏదైనా నిర్ణయం తీసుకొని పోస్ట్ ఫోన్ చేయాలనుకుంటే డెఫినెట్‌గా తెలంగాణ ప్రభుత్వం వారికి సహకరిస్తదని, వాళ్లు పోటీలు నిర్వహించాలి అని అనుకున్నప్పుడు మనం వాటిని పోస్ట్ పోన్ చేయలేమని స్పష్టం చేశారు. 105 దేశాల నుంచి మిస్ వరల్డ్, మిస్ కంట్రీస్ వచ్చి ఇక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్‌లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
అలాగే వాళ్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కలిపి ఒక మూడు నుంచి నాలుగు వందల మంది డెలిగేట్స్ తెలంగాణలో ఉన్నారని చెప్పారు. వీళ్లతో పాటు ఈ ఇవెంట్ నడిపించే స్పాన్సర్షిప్ చాలామంది ఇక్కడే ఉన్నారని, వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అది అని చెప్పుకొచ్చారు. కవిత ఒక తెలంగాణ నాయకురాలుగా ఉండి ఆమె ఒక రాజకీయ నాయకురాలిగానే కాకుండా ఇంతో అంతో ఇంకితజ్ఞానం ఉండి అమెరికాలో కూడా చదువుకొని వచ్చింది.. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరిధి ఏంటి అనేది ఆమెకి అర్థం అయి ఉండాలన్నారు. కానీ రాజకీయం చేయాలనే దురుద్దేశం నుంచి దూరంగా ఉండి వాస్తవాలు మాట్లాడాలని ఎంపీ చామల కోరారు.






