- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో చర్చిస్తాం.. ఎంపీ చామల ఆసక్తికర వ్యాఖ్యలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Parliament Monsoon Session) పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మొదటి సారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో చర్చిస్తామని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల వల్లే భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని పదే పదే ట్రంప్ మట్లాడుతున్నారో.. దీనిపై ప్రధాని మోడీ, సంబంధింత మంత్రులు దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భారత దేశ ప్రజలను ఆదేశించినట్లు పక్క దేశంలో ట్రంప్ పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నారని దానిపై కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోందన్నారు. దానిపై ప్రతిపక్ష నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దానితో పాటు మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటరు నమోదు విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దానిపై పార్లమెంట్‌లో నిలదీస్తామని, ఎలక్షన్ కమిషన్ పారదర్శకతతో పని చేయాలని సూచించారు. దీనిపై చర్చలు జరుపుతామని చెప్పారు. అలాగే మణిపూర్, జమ్మూ కాశ్మీర్ సమస్యలపై కూడా చర్చిస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.






