- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యూలైన్‌లో నిల్చున్న ప్రతీ పేషెంట్‌ను పలకరించిన MP.. బీబీనగర్ ఎయిమ్స్‌ను ఆకస్మిక తనిఖీ
బీబీనగర్ ఎయిమ్స్(Bibinagar AIIMS)ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీబీనగర్ ఎయిమ్స్(Bibinagar AIIMS)ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి రోజూ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు.. వాళ్లకు ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుంది, అవసరమైన పేషెంట్‌లకు ఆపరేషన్లు చేస్తున్నారు లేదా అని ఆరా తీశారు. క్యూ లైన్‌లో నిల్చున్న ప్రతి పేషెంట్ పలకరిస్తూ, డాక్టర్‌లు సమయానికి వస్తున్నారా, అని ఎక్యుమెంట్స్ ఉన్నాయా? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్‌లో సిబ్బంది నియామకం జరుగుతుందా, జరిగితే ఏ ప్రాతిపాదికన జరుగుతుంది, దీనిని ఏ ఏజెన్సీ నిర్వహిస్తున్నది, దీనిలో లోకల్ వాళ్ళకు ఎంత వరకు ప్రాధాన్యత ఇస్తున్నారని అడిగారు.
సిబ్బంది నియామకంలో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని అలాంటివి జరగకుండా పారదర్శకంగా ఉండాలని సూచించారు. మిగతా సివిల్ వర్క్స్(Civil Works) ఎంత వరకు పూర్తి అయ్యింది, పూర్తి కాకాపోతే ఎప్పటి వరకు పూర్తి అవుతుంది, పేషెంట్‌లకు అని సౌకర్యాలతో బిల్డింగ్‌లు అందుబాటులోకి ఎప్పుడు వస్తాయి అడిగారు. తర్వగా పూర్తి చేయాలని ఆదేశించారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా, డిప్యూ డైరెక్టర్ డాక్టర్ విపిన్ వర్గీస్ పాల్గొన్నారు.






