- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MP Chamala: జూబ్లీహిల్స్‌లో మీ నాటకాలు నడవవు.. హరీశ్‌రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫైర్
ఎవరి గూబ గుయ్యి అంటుందో.. హరీశ్‌రావుకి తొందరలోనే తెలుస్తుందని, ఎన్నికలు వచ్చాయి అని ఆయన పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు

దిశ, తెలంగాణ బ్యూరో : ఎవరి గూబ గుయ్యి అంటుందో.. (Harish Rao) హరీశ్‌రావుకి తొందరలోనే తెలుస్తుందని, ఎన్నికలు వచ్చాయి అని ఆయన పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) మండిపడ్డారు. ఉపఎన్నిక అంటే హరీశ్‌రావుని ట్రబుల్ షూటర్ అని డబ్బా కొట్టేవాళ్ళు అని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎంత డబ్బు పెట్టారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. జూబ్లీహిల్స్‌లో కూడా అదే చేద్దాం అనుకున్నారు కానీ, మీ నాటకాలు నడవవు అని ఫైర్ అయ్యారు. ఆదివారం చామల కిరణ్ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లక్ష ఇల్లు ఎక్కడ కట్టారు? ఎవరికిచ్చారు? హరీశ్ రావు చెప్పాలని, అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఇష్టానుసారంగా నాళాలను చెరువులని కబ్జాలు చేశారని ఆరోపించారు.
చిన్న వాన పడితే హైదరాబాద్‌లో తిరగలేని పరిస్థితి నెలకొన్నది, దానికి కారణం ఎవరు అని చామల ప్రశ్నించారు. నవీన్ యాదవ్ పేరు రాగానే బీఆర్ఎస్ ఇంకా గెలవదని తెలిసిపోయిందని, ఎవరు గూండాలు ఎవరు డబ్బులతో గెలవాలని చూస్తున్నారో వచ్చే నెల 11వ తారీఖు ప్రజలు నిర్ణయిస్తారని చామల కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్నేతలు సెంటిమెంట్ మీద ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారని, ప్రజలు అమాయకులు కాదన్నారు. మీ పార్టీ భూస్థాపితం కావడం పక్క అని చామల కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. హరీశ్‌రావు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నావు.. నువ్వు నీ బామ్మర్దికి ఎన్నికల ఫలితాలే చెంప చెల్లుమనేలా చేస్తాయని ఆయన అన్నారు.






