- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీకి తెలంగాణపై సవతి తల్లి ప్రేమ : ఎంపీ చామల ఫైర్
రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణాను మరిచిపోయారు, మీ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారన్న విషయాన్ని కూడా మోడీ మరచిపోయినట్లున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణాను మరిచిపోయారు, మీ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారన్న విషయాన్ని కూడా మోడీ మరచిపోయినట్లున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ ప్రసంగంపై ఎంపీ చామల స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఒక సెమీ కండర్టర్ కంపెనీ తెలంగాణాలో పెట్టాలన్న ఆలోచనతో వస్తే, దాన్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టేట్లు అయితేనే తాము అనుమతి ఇస్తామని కేంద్రం ఒత్తిడి తెచ్చిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబునాయుడు కేంద్రంతో పొత్తులో భాగమైనందున దానిని ఆంధ్రకు పంపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అంతకు ముందు రెండు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు తెలంగాణాలో పెట్టేందుకు వస్తే గుజరాత్ తీసుకెళ్లారని, తమిళనాడులో కూడా సెమీ కండక్టర ప్రాజెక్టు పెట్టేందుకు ముందుకొస్తే దాన్ని కూడా గుజరాత్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని ఎంపీ చామల ఆరోపణలు గుప్పించారు. నరేంద్ర మోడీ దేశానికి ప్రధాన మంత్రి అని, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి అబివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. మోడీ సెమీ కండెక్టర్ గురించి మాట్లాడరని 1983లోనే చండీగడ్ లో సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు చెంది ఒక కార్యాలయాన్ని ప్రారంభించారని, దాని గురించి ప్రధాని చెప్పే ప్రయత్నం చేయలేదన్నారు.
ఒకప్పుడు ఆయన గుజరాత్ కు సీఎం పనిచేశారని, ఇప్పటికి కూడా సీఎంగానే వ్యవహస్తున్నట్లుగా కనిపిస్తోందని ఎంపీ చామల విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి పార్టీ కార్యాలయంలో మాట్లాడుకోవాల్సిన అంశాన్ని లాల్‌ఖిలాపై జండా ఎగురవేసి మోడీ ఏలా మాట్లాడతారని, వంద సంత్సరాలు ఆర్‌ఎస్‌ఎస్ దేశాభివృద్ది, సమగ్రత కోసం ఏలా పని చేసిందో మోడీ గొప్పలు చెప్పారని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఆయన అక్కడ మాట్లాడే బదులు బీజేపీ ఆఫీసులో మాట్లాడితే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడ 5 ట్రిలియన్ ఎకనామీ చేసి తోడ్పాటు అందించాలని ముందుకు వస్తున్నారు, కానీ మీరు దానిని విస్మరిస్తూ తెలంగాణకు రావల్సిన ప్రాజెక్టులను పక్కదోవ పట్టిస్తున్నారని ఎంపీ చామల మోడీపై ఆరోపణలు గుప్పించారు.






