Chamala: సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేసిన చరిత్ర కేటీఆర్ ది: చామల

by Prasad Jukanti |   (  Updated:2025-07-18 10:32:05  IST  )

దుబాయిలో కేదార్ తో పెట్టుబడులు పెట్టించింది ఎవరు అని ఎంపీ చామల ప్రశ్నించారు.

Chamala: సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేసిన చరిత్ర కేటీఆర్ ది: చామల
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ దని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. , సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేసిన కేటీఆర్ ఖమ్మం చౌరాస్తాలో కూర్చుని కమ్మని ముచ్చట్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోందని అలాంటిది కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ గురించి గూగుల్ చేస్తే నీ పేరు మీ నాన్న పేరు వస్తోందని సెటైర్ వేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన చామల.. ఖమ్మంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మా మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెబుతున్న కేటీఆర్ రాత్రి కలగన్నారా అని ఎద్దేవా చేశారు. నీటి కేటాయింపుల్లో మన వాట మనకు దక్కాల్సిందేనని చెప్పారు.

డ్రగ్స్ తో కేదార్ చనిపోయినట్లు తెలిందని, దుబాయిలో కేదార్ తో పెట్టుబడులు పెట్టించింది ఎవరు అని ప్రశ్నించారు. కేటీఆర్ రచ్చ, చర్చ అని ఆరోపణలు చేస్తున్నారని కానీ గత పదేల్లు చర్చ లేకుండా అసెంబ్లీ నడిపారని గుర్తు చేశారు. మిస్ ఇంగ్లాండ్ విషయంలో కేటీఆర్ కామన్సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతి రోజు తప్పుడు ప్రచారం చేయడం ద్వారా మళ్లీ అధికారంలోకి వస్తామనే పిచ్చి ఆలోచనలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదని మాట్లాడుతున్న కేటీఆర్ కు కళ్లు దబ్బాయా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story