కేటీఆర్ ఎమ్మెల్యే మాత్రమే.. సీఎంను సవాల్ చేసే అధికారం లేదు: ఎంపీ చామల

by Ajay Maddhiboyina |

మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని సవాల్ చేసే అధికారం కేటీఆర్‌కు లేదన్నారు.

కేటీఆర్ ఎమ్మెల్యే మాత్రమే.. సీఎంను సవాల్ చేసే అధికారం లేదు: ఎంపీ చామల
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని సవాల్ చేసే అధికారం కేటీఆర్‌కు లేదన్నారు. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే అని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌లో ఉంటూ ప్రగతిని పట్టించుకోకుండా..ఫామ్‌హౌస్‌లో ఉన్న దరిద్రపు పాలన మీది అంటూ ఫైర్ అయ్యారు. దీని గురించి చర్చించకుండా తీస్మార్ ఖాన్ లా కుర్చీ వేసి కూర్చుకుని పోజులు కొడుతున్నాడని మండిపడ్డారు.

కేటీఆర్ ఆఫ్రాల్ ఎమ్మెల్యే అని ముఖ్యమంత్రిని సవాల్ చేసే అధికారం లేదని అన్నారు. ముఖ్యమంత్రిని సవాల్ చేయడానికి అధికారం ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందని, కానీ మీ నాయన కేసీఆర్ బయటకే రావడం లేదన్నారు. నువ్వు వకాలత్ పుట్టించుకుని వస్తే ఎవ్వరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు. మెచ్యురిటీ ఉన్న లీడర్ లా కేటీఆర్ ఎదగాలని హితవు పలికారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం ఇల్లు, సన్నబియ్యం ప్రజలకు అందుతున్నాయో లేదో పరిశీలించారా.. అని ప్రశ్నించారు.

Next Story