- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పథకాన్ని నిర్వీర్యం చేయాలనే గాంధీ పేరు తొలగించారు: ఎంపీ చామల
ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ

దిశ, వెబ్ డెస్క్: ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడంతో బీజేపీ ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తోందని అన్నారు. ప్రతి పేదవాడికి పని కల్పించాలన్న ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఇది వరకు కేంద్ర ప్రభుత్వం వందశాతం పథకం కోసం ఫండింగ్ ఇచ్చేదని అన్నారు.
ఇప్పుడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఫండింగ్ చేసేలా నిర్ణయం తీసుకుని పథకాన్ని నిర్వర్యం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే కేంద్రప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ అండ్ అజీవిక మిషన్ గా మార్చేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై దుమారం రేగింది. అంతేకాకుండా పథకం అమలులో మార్పులు చేయడం ద్వారా రాష్ట్రప్రభుత్వాలపై భారం పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.






