ప్రజలను తప్పుదోవ పట్టించాలనేదే బీజేపీ లక్ష్యం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

by Ajay Maddhiboyina |

దేశంలోని ప్రస్తుతం నెలకొన్నఅనేక సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరగాలని, కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడి ప్రజలను తప్పుదోవ

ప్రజలను తప్పుదోవ పట్టించాలనేదే బీజేపీ లక్ష్యం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోని ప్రస్తుతం నెలకొన్నఅనేక సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరగాలని, కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించాలనేదే బీజేపీ లక్ష్యమని, భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇండిగో విమానయాన సంస్థ వలన ఇబ్బందులు పడుతున్న ప్రజల గురించి, ఢిల్లీ కాలుష్యం, దేశంలోని నిరుద్యోగ సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరగాలని, కేవలం ఎన్నికలు, రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడుతోందని ఆయన ధ్వజమెత్తారు.

సోమవారం ఢిల్లీలో మీడియాతో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ, పీసీసీ, డీసీసీ మీటింగ్స్ లో వందేమాతరం గీతాన్ని పాడతామని, ఆర్ఎస్ఎస్, బీజేపీ సమావేశాల్లో వందేమాతరం గీతాన్ని పాడరన్నారు. సడెన్ గా బీజేపీ వందేమాతరంపై పార్లమెంట్ లో చర్చ పెట్టి మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూలపై చెడు ప్రచారం చేయాలని చూస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరపున తాము చర్చలో పాల్గొని ప్రజలకు వాస్తవాలు చెప్తామని, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కాంగ్రెస్ నాయకులపై విష ప్రచారం చేస్తోందని, బీజేపీ చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు.

Next Story