- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూసైడ్ స్టార్ కౌశిక్ రెడ్డి మీడియాలో ఉండాలని కబుర్లు చెప్తున్నాడు..ఎంపీ చామల కౌంటర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి సూసైడ్ స్టార్అని, మీడియాలో ఉండాలని కంటెంట్ లేని కబుర్లు చెప్తున్నాడు అని ఆయన మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి సూసైడ్ స్టార్అని, మీడియాలో ఉండాలని కంటెంట్ లేని కబుర్లు చెప్తున్నాడు అని ఆయన మండిపడ్డారు. మంగళవారం చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికలలో ఓట్లు వేయకపోతే పాడే ఎక్కుతానని భయపెట్టించిన వ్యక్తివి నువ్వు.. కొత్తగా కౌశిక్ రెడ్డి ముగ్గురు ఎంపీలు వచ్చారు ఏదో ఒక కథా, కార్ఖానా మైందని మాట్లాడుతున్నారని ఎంపీ చామల ఎద్దేవా చేశారు.
కౌశిక్ రెడ్డిని చూస్తే పాడి కౌశిక్ రెడ్డి నుంచి మాడ్ కౌశిక్ రెడ్డిగా మారినట్లు అనిపిస్తుందని, మ్యాడంటే మెంటల్ మాత్రమే కాదు...మీడియా అటెన్షన్ డిసీస్ అని ఎంపీ చామల విమర్శించారు. మీడియా స్టార్ అవుదామని దొర దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని మాట్లాడినట్లు అనిపిస్తుందన్నారు. ఆ దరిద్రపు ముగ్గురు ఎంపీలు ఎవరు వచ్చి మాట్లాడారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. లోక్సభలో బీఆర్ఎస్ మిగిలింది గుండు సున్న.. ఆ ముగ్గురు ఎంపీలు మిగిలింది రాజ్యసభలో అన్నారు.
వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పేరు పెట్టుకున్నప్పటికీ కూడా అర్హత లేని పరిస్థితి నెలకొందని ఆయన చురుకలు అంటించారు. లోక్సభలో సున్నా, రాజ్యసభలో ఉన్న ముగ్గురు ఎంపీలు కూడా ఫామ్ హౌస్ లో మీ దొర దగ్గర ఉన్నారని, రాత్రి నీకు కలలోకి వచ్చిన ఆ ముగ్గురు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలు అయితే కాదు కదా అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎందుకంటే నీకు ఈ మ్యాడ్ అనే డిసీజ్ వచ్చిన తర్వాత అడపాదడపా మీడియాలో మాట్లాడి .. పనికిరాని కబుర్లు చెప్పి రాజకీయంగా ఉండాలని ఆలోచన నీలో కనిపిస్తోందని, ఏ మాత్రం నీకు జ్ఞానం ఉన్నట్టు కనిపించడం లేదు కౌశిక్ రెడ్డి అని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మండి పడ్డారు.






