- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ ఔటర్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు వేగవంతం చేయండి: ఎంపీ చామల
హైదరాబాద్ ఔటర్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టును వేగవంతం చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఔటర్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టును వేగవంతం చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం లోక్ సభలో ఎంపీ మాట్లాడుతూ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటి ఔటర్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందుతుందని అన్నారు. దాదాపు 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుకొని దాదాపు 6 రైల్ ఓవర్ రైల్వే వంతెనలు, రాబోయే రీజినల్ రింగ్ రోడ్‌కు సమాంతరంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌ను చుట్టుముట్టే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.12,000 కోట్లని వెల్లడించారు. ఉత్తరం వైపున సర్వే భాగం పూర్తయింది, దక్షిణం వైపున సర్వే జరుగుతోందని అన్నారు. భారతదేశం $ 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుందని అన్నారు.
ఇది మన ప్రధానమంత్రి మోదీ నొక్కిచెప్పిన విధంగా వీక్షిత్ రాజ్య-వీక్షిత్ భారత్-2047 యొక్క థీమ్ అని పేర్కొన్నారు. లక్ష్యాన్ని సాధించడానికి మన ప్రధాని ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించి, రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ కనెక్టివిటీని పెంచుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం చుట్టూ రావడంతో ఐటీ హబ్‌లు, ఫార్మాస్యూటికల్ క్లస్టర్‌లు, లాజిస్టిక్ పార్కులు, అభివృద్ధి చెందుతున్న పట్టణ వృద్ధి కేంద్రాలు వంటి కీలక మండలాలను అనుసంధానిస్తుందని తెలిపారు. రాష్ట్రం అంతటా కొత్త వృద్ధి కారిడార్‌లను అనుసంధానం చేస్తుందని, దీంతో రాష్ట్రంలో 60 శాతం పట్టణీకరణకు సహాయపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను తీర్చడానికి, పరివర్తన అభివృద్ధికి దారితీస్తుందని, విక్షిత్ భారత్-2047 కోసం విక్షిత్ రాజ్యంలో భాగం కావడానికి ఈ ప్రాంతం అంతటా ఉద్యోగ ఉపాధికి దోహదం చేస్తుందని అన్నారు. పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించేటప్పుడు తెలంగాణ లాజిస్టిక్స్, మొబిలిటీ పర్యావరణ వ్యవస్థకు మైలురాయిగా నిలుస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి 377 నిబంధన మేరకు జోక్యం చేసుకోవాలని లోకసభ స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు.






