- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్‌లో అసలైన వ్యక్తినే మాయం చేశారు: ఎంపీ చామల
ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు లాగే అరవింద్ కుమార్ కూడా కీలక వ్యక్తి అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు లాగే అరవింద్ కుమార్ కూడా కీలక వ్యక్తి అని అన్నారు. విచారణ జరుగుతున్నప్పటి నుండి అరవింద్ కుమార్ కనిపించడం లేదని చెప్పారు. ఆయన గురించి వెతుకుతున్నామని అన్నారు. కుట్రలో భాగంగానే అరవింద్ కుమార్ కనిపించకుండా పోయారని ఆరోపించారు. ఈ రోజే అరవింద్ కుమార్ పై ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు.
ఆయన ఎక్కడ ఉన్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావు ఎంక్వైరీలో పాల్గొంటున్నారు కానీ ఈ కేసులో అసలైన వ్యక్తి అరవింద్ కుమార్ విదేశాలకు వెళ్లిపోయారని అన్నారు. ప్రభాకర్ రావు మాదిరిగానే అరవింద్ కుమార్ కూడా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారని అనుమానం వ్యక్తం చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా జరిగిన రూ.44 కోట్ల ట్రాన్సాక్షన్‌లో అరవింద్ కుమార్ ముఖ్యమైన అధికారి అని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను అరెస్ట్ చేయాలన్నా అరవింద్ కుమార్‌ను విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపారు.






