- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరి జలాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన గోదావరి జలాలు రావాల్సిందేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన గోదావరి జలాలు రావాల్సిందేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీ భవన్బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్మాట్లాడారు. గోదావరి జలాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడాలని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి బాధ్యతగా వ్యవహరించట్లేదని విమర్శించారు. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ బనకచర్లపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. కృష్ణ జలాలు, గోదావరి జలాలపై తెలంగాణ వాటా కోసం మాట్లాడాల్సిన భాద్యత ఎంపీలుగా తమకు బాధ్యత ఉందన్నారు.
1980 ప్రకారం నిర్ణయాలు తీసుకునే ముందు పొందు పరిచిన అంశాలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని, అసలు ఇప్పుడు నీళ్లతోనే తెలంగాణకు సమస్య నెలకొందన్నారు. ఆయా సమస్యలపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అల్ పార్టీ ఎంపీల మీటింగ్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం కడుతున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా స్పందించాలన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకుండా గోదావరి జలాలను కాపాడాలని ఈసందర్భంగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.






