- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దెబ్బతగిలి కేటీఆర్‌కి మెదడు దొబ్బింది.. ఎంపీ చామల ఆగ్రహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మెదడు దొబ్బిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మెదడు దొబ్బిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను కేటీఆర్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి సీఎం మాట్లాడారని, కేటీఆర్ కి మెడ, కాళ్ల నొప్పులు దెబ్బకే పోయాయన్నారు. సమ్మె చేయొద్దు.. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని సీఎం చెప్పారని, గతంలో 52 రోజులు సమ్మె చేస్తే.. కేటీఆర్ ఒక్క రోజు బయటికి రాలేదన్నారు. సమ్మె చేస్తున్న వారిని నానా బూతులు ఆ నాడు తిట్టారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ లా సౌమ్యంగా ఎప్పుడూ చెప్పలేదన్నారు.
ఆ రోజుల్లో సమ్మె చేస్తే ఉద్యోగ సంఘాల్లో శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యే చేసి, ఉద్యోగ సంఘ నేతలు మాట్లాడకుండా చేశారని విమర్శించారు. మిగులు రాష్ట్రాన్ని ఇస్తే 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, వాస్తవ పరిస్థితులు చెప్పే ప్రయత్నం సీఎం చేశారన్నారు. ఎన్నడూ కేటీఆర్ ఊరికే లేరు.. ప్రతి రోజు తప్పుడు ప్రచారమే చేశారని వ్యాఖ్యనించారు. తెలంగాణలో బిల్లులు రావడం లేదు.. అవన్నీ ఆనాడు కేసీఆర్ పెట్టి పోయినవి కదా? అని ప్రశ్నించారు. మిగులు రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం చేశారని, బీఆర్ఎస్ హయాంలో దోచుకున్నదే కాకుండా.. మళ్ళీ వచ్చే వాళ్లు పరిపాలన చేయకుండా చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు లెక్కలు తెలియవు అనుకుంటున్నావా కేటీఆర్...? మీ హయాంలో ఒకటో తారీకు జీతాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? చెప్పాలని డిమాండ్ చేశారు.
లక్ష 50 వేల కోట్లు అప్పు కట్టామని, మిస్ వరల్డ్ కి ఖర్చు 250 కోట్లు కాదు.. 27 కోట్లే అని స్పష్టం చేశారు. కేటీఆర్.. దోపిడీలో భాగస్వామి, తప్పుడు లెక్కలు చెప్పడం భావ్యం కాదన్నారు. మీరు దోచుకున్నంత దేశంలో ఎవరూ దోచుకోలేదని, కేటీఆర్‌కి సిగ్గు శరం లేదన్నారు. కాళేశ్వరంలో ఓ అధికారి జైలుకి వెళ్ళాడు, మీరు చెప్తేనే కరెక్ట్ అనేది దుర్మార్గపు ఆలోచన అని అన్నారు. బీఆర్ఎస్ పగటి కలలు నెరవేరవు, రేపటికి రేపు సీఎం కుర్చీలో కేటీఆర్ కూర్చోలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగో లేకున్నా సీఎం 21 వేల కోట్ల రుణమాఫీ చేశాడని, రుణమాఫీ చేసినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలా? అన్నారు. మ్యానిఫెస్టో గురించి మాట్లాడే హక్కు కేటీఆర్ కి లేదన్నారు. ఆర్టీసీ సమ్మె 52 రోజులు జరిగితే ఎందుకు మాట్లాడలేదన్నారు. కేటీఆర్ చెప్పినట్టుగా 2000 ఎకరాలు తీసుకురావాలి, ఆ 2000 ఎకరాలు బయటపెట్టాలని పేర్కొన్నారు. చెల్లె కవితను బయటకు పంపాలి.. బావను పడుకోబెట్టాలి కేటీఆర్ చూస్తున్నాడని విమర్శించారు. సీఎం ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తుంటే,






