- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NRIs: మెల్బోర్న్‌లో సంక్రాంతి సంబరాలు.. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ
by Ramesh Naini |
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేసేలా విదేశాల్లోనూ తెలుగు వారు పండుగలను ఘనంగా చేసుకుంటారనే విషయం తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేసేలా విదేశాల్లోనూ తెలుగు వారు పండుగలను ఘనంగా చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలోని (Melbourne) మెల్బోర్న్‌లో ముందుగానే సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) శనివారం ఎక్స్ వేదికగా సంక్రాంతి సంబరాల ఫోటోలు పంచుకున్నారు. మెల్బోర్న్ , క్రాగిబర్న్‌లో జరిగిన (Sankranti celebrations) సంక్రాంతి సంబురాలకు మెల్బోర్న్ తెలంగాణ ఫోరం (ఎమ్‌టీఎఫ్) ఆహ్వానం మేరకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంక్రాంతి సంబరాలలో మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ప్రెసిడెంట్ నూకల లక్ష్మీ వెంకట్ రెడ్డి, ప్రముఖులు పాల్గొన్నారు.
Next Story






