యూరియా కొరతను తీర్చండి

by velandi.Saikiran |

యూరియా కొరతను తీర్చండి అవసరమైనంతగా యూరియాను సరఫరా చేయండి కేంద్రానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి

యూరియా కొరతను తీర్చండి
X

యూరియా కొరతను తీర్చండి

అవసరమైనంతగా యూరియాను సరఫరా చేయండి

కేంద్రానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఖరీఫ్​ సీజన్​ 2025లో రైతులు తీవ్రమైన యూరియా కొరతను ఎదుర్కొంటున్నారని, తెలంగాణ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని యూరియా సరఫరా సమస్య పూర్తిగా పరిష్కారించాలని మంగళవారం కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్​ ను ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి కోరారు. తెలంగాణకు కేటాయించిన మొత్తం 9.80 లక్షల మెట్రిక్​ టన్నుల (ఎల్ఎంటీ) యూరియాలో 2025 జులై 31 నాటికి కేవలం 4.36 ఎల్ఎంటీ మాత్రమే సరఫరా చేశారన్నారు. ఏప్రిల్​నుంచి జులై వరకు 6.60 ఎల్ఎంటీ సరఫరా చేయాల్సి ఉండగా 2.24 ఎల్ఎంటీ తక్కువగా వచ్చిందన్నారు.

ఆగష్టు నెలలో అవసరం సుమారు 3.50 ఎల్ఎంటీ కాగా, ఇప్పటి వరకూ కేవలం 1.70 ఎల్ఎంటీ మాత్రమే సరఫరా కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చామల కిరణ్​కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు ఇది పెద్ద సమస్యగా మారిందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాని కలసి ఈ సమస్యను వివరించారన్నారు. ఇదే విషయంపై తాను కూడా కేంద్ర మంత్రులు నడ్డా, అనుప్రియ పటేల్ కి లేఖలు రాసినట్లు ఎంపీ చామల కిరణ్​ తెలిపారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలసి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు.

Next Story