- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ డిస్టర్బ్ చేస్తుండు.. వీడియోలు కట్ చేసి క్రియేట్ చేస్తున్నారు: ఎంపీ చామల ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ (BRS) అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చూస్తుంటే.. కేటీఆర్ డిస్టర్బ్ చేస్తుండు.. అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కోడి గుడ్డు పైన ఈకెలు పీకినట్లు బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, సైకో రాము (కేటీఆర్) కల్లు తాగిన కోతి లాగా మాట్లాడుతుండని విమర్శించారు. రామప్ప గుడి దగ్గర అత్యుచ్చాహంతో ఎవరో ఒక అమ్మాయి మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కాళ్ళు కడిగింది.. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అన్నట్లు గొడవ చేస్తున్నారని చెప్పారు.
దానికి తెలంగాణ మహిళల ఆత్మ గౌరవం ఏమైంది అంటూ సోనియాగాంధీకి కేటీఆర్ ట్వీట్ చేసిండన్నారు. పదేళ్ల పాలనలో వాళ్ళ ఇంటి ఆడబిడ్డ గురించి తప్ప ఏ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడలేదని, అలాంటి కేటీఆర్ మహిళల ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. కలెక్టర్ల కాళ్ళు కడిగించుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీది కేటీఆర్.. అని ఫైర్ అయ్యారు. జనాన్ని తప్పుదోవ పట్టించాలని కేటీఆర్ రోజు ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో దండుకున్న వందల కోట్ల రూపాయలతో కొన్ని యూట్యూబ్ చానల్స్‌తో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ప్రెస్‌మీట్ వీడియోలను కట్ చేసి వాళ్లకు అనుకూలంగా క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు.






