రాంచందర్ రావుకు మతి మరుపు ఉన్నట్లు ఉంది: MP చామల

by Gantepaka Srikanth |

బీజేపీలో పాత కళాకారులు పోయి కొత్త కళాకారుడు వచ్చాడని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

రాంచందర్ రావుకు మతి మరుపు ఉన్నట్లు ఉంది: MP చామల
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో పాత కళాకారులు పోయి కొత్త కళాకారుడు వచ్చాడని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మీడియా కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు గత పదేళ్ల తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దుతున్నారు. రాంచందర్ రావు మాటల్లో సబ్జెక్ట్ లేదు. ఆయనకు మతిమరుపు ఉన్నట్లు ఉందని, విషయ పరిజ్ణానం పెంచుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డులలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. RRR, మెట్రో ఫేజ్-2 దగ్గర మోడీ ఫోటోలు పెడతామని ఎద్దేవా చేశారు. బ్రిటీష్ హాయాంలోనే కొందరు మైనారిటీ ముస్లింలను బీసీలలో చేర్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా మైనారిటీ ముస్లింలు బీసీలలోనే ఉన్నారని గుర్తుచేశారు. గత పదేళ్ళలో ఏరోజైనా తుంగతుర్తి అభివృద్ధి గురించి జగదీష్ రెడ్డి మాట్లాడాడా, గంజి లేని జగదీష్ రెడ్డి బెంజ్ లో ఎలా తిరుగుతున్నాడని ప్రశ్నించారు.

Next Story