- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోతిరెడ్డిపాడుకు గండి కొట్టడానికి సహకరించిందే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎంపీ చామల తీవ్ర ఆరోపణలు

దిశ, తెలంగాణ బ్యూరో: (Pothireddypadu Reservoir) పోతిరెడ్డిపాడుకు గండి కొట్టడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించింది అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే పదేండ్లు కేసీఆర్ ఎందుకు సైలెంట్ ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు నిత్యంపై నాపై ట్రోల్ చేసి నన్ను ఫేమస్ చేశారని అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ (BRS) నాయకులకు ధన్యవాదాలన్నారు. నేను మాట్లాడిన దాంట్లో కొంత భాగం తీసి ప్రచారం చేస్తున్నారు నాపై ట్రోల్ చేస్తే భయపడి సైలెంట్ ఉంటానని బీఆర్ఎస్ నాయకులు భ్రమపడుతున్నారని అన్నారు. ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడితే బీఆర్ఎస్ సోషల్ మీడియా మూడు రోజులు ప్రచారం చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఏ సంవత్సరం ఎన్ని నీళ్లు వాడారో వివరాలు పట్టుకుని రండి బనకచర్ల ప్రాజెక్టుపై కొన్ని రోజులు డ్రామా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తోందని హరీవ్‌రావు ఏకపాత్రాభినయం చేశాడు. హరీశ్‌రావు ఏకపాత్రాభినయం పేలలేదు కాబట్టి వినోద్ రావును తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. బనకచర్ల విషయంలో చంద్రబాబును బూచిగా చూపించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని అబద్ధాలను ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. బనకచర్ల, ఆల్మట్టి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వంగా లేదని ఎంపీ చామల స్పష్టం చేశారు.






