Chalama: చచ్చేవరకు సీఎంగా ఉండాలనే పిచ్చి భ్రమలో కేసీఆర్.. చామల సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-07-26 11:52:36  IST  )

బీఆర్ఎస్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Chalama: చచ్చేవరకు సీఎంగా ఉండాలనే పిచ్చి భ్రమలో కేసీఆర్.. చామల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారని పగటి కలలు కంటూ కేటీఆర్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. 200 మంది చెంచాలను వెంటబెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చామల.. బీఆర్ఎస్ కు అధికారం దూరమై కేవలం ఏడాదిన్నరే అయిందన్నారు. రేవంత్ రెడ్డి పాలన విషయంలో ప్రజల మనసుల్లో విషబీజాలు నాటేందుకు బీఆర్ఎస్ నేతలు రోజుకో నాటకానికి తెర లేపుతూ విఫలం అవుతున్నారని దయ్యబట్టారు. రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యతిరేక ప్రచారం విఫలం అవడాన్ని కేసీఆర్ కుటుంబం తట్టుకోలేక పోతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఏమీ జరగడం లేదని మేమొచ్చాక ఏదో చేస్తామని అంటున్న కేసీఆర్ ఈ పదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ చచ్చిపోయే వరకు సీఎంగా ఉండాలని పిచ్చి భ్రమలో ఉండి, పదవి పోయే వరకు ఫార్మ్ హౌస్‌లో పడ్డారన్నారు. 2014, 2018 బీఆర్ఎస్ మేనిఫెస్టోలు దగ్గర పెడితే 70కి పైగా హామీలు నెరవేర్చలేదని ఇవాళ గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా సంక్షేమం కనిపిస్తోందన్నారు.

కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ కేటీఆర్ తప్ప ఇంకెవరూ చేయలేదని చామల ఆరోపించారు. మొన్నటి వరకు మా పార్టీలోనే ఉన్నవాడు ఇప్పుడు మీ పార్టీలో చేరి ఓవర్ ఫర్మార్మెన్స్ చేస్తున్నాడని పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి దుయ్యబట్టారు. ఓట్లేయకపోతే నేను చస్తానని బెదిరించి ఓట్లు వేయించుకున్న దరిద్రుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి ఫేమస్ కావాలని ప్రయత్నిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని తిట్టడం ద్వారా బీఆర్ఎస్ నేతలు ఫేమస్ కావాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Next Story