- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: ధర్నాకు దిగిన బండి సంజయ్.. కొత్తపల్లిలో హై టెన్షన్ (వీడియో)
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎంపీ,

దిశ, కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిస్సిగ్గుగా ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపల్లిలో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. పోలింగ్ ప్రచారం ముగిశాక తమ స్థానిక నాయకుడు వాసాల రమేశ్ నివాసానికి టీ తాగేందుకు వెళ్లగా.. బీఆర్ఎస్ నేతలు కొత్తపల్లిలో డబ్బులు పంచుతున్నారని తమ పార్టీ కార్యకర్తలు తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు దాదాపు 3 గంటల నుండి అడ్డగోలుగా డబ్బులు పంచుతుంటే.. దానిని అడ్డుకున్న మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారుని మండిపడ్డారు.
నిస్సిగ్గుగా ఓటర్ లిస్టు పట్టుకుని ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తూ.. డబ్బులు ఇచ్చిన తరువాత ఆ లిస్ట్‌పై పెయిడ్ అని రాసుకుంటూ ఇంటింటికీ తిరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? పెట్రోలింగ్ వెహికల్స్ ఏమైనాయని ప్రశ్నించారు. పోలీసులు బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ రూరల్‌లో పోలీసులే డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. దాదాపు రూ. 5 కోట్లు డబ్బులు పంచుతున్నారు.. ఇంత దుర్మార్గమా అని ప్రశ్నించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. కిందిస్థాయి సిబ్బంది మాత్రం బీఆర్ఎస్ తొత్తులుగా మారారని ఫైర్ అయ్యారు. కార్యకర్తలారా.. ఈరోజు, రేపు అప్రమత్తంగా ఉండండి. ఎవరూ నిద్రపోకండి. పోలీసులు పట్టించుకోకుంటే మీరే పెట్రోలింగ్ చేయండని సూచించారు. ప్రతి కార్యకర్త పోలీసులా మారండి.. బీఆర్ఎస్ నేతల డబ్బులు పట్టుకోండి. అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును పట్టుకుని పేదలకు పంచండని సూచించారు.






