- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోంగార్డ్ రవీందర్ చావుకు కేసీఆర్ సర్కార్‌దే బాధ్యత: MP బండి సంజయ్
హోంగార్డు రవీందర్ చావుకు కేసీఆర్ సర్కారుదే బాధ్యత అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : హోంగార్డు రవీందర్ చావుకు కేసీఆర్ సర్కారుదే బాధ్యత అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రవీందర్ మరణం అత్యంత విషాదకరమని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని బండి డిమాండ్ చేశారు. రవీందర్ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యాలను బయటపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. రవీందర్ ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రవీందర్ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అలాగే వారిని అన్ని విధాలా ఆదుకోవాలని బండి డిమాండ్ చేశారు.
Next Story






