- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడికో ప్రీతి కేసు ముమ్మాటికి లవ్ జిహాదే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కాకతీయ మెడికల్ కాలేజ్‌లో సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ మెడికో ప్రీతి ఘటనపై టీ-బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాకతీయ మెడికల్ కాలేజ్‌లో సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ మెడికో ప్రీతి ఘటనపై టీ-బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెడికో ప్రీతి కేసు ముమ్మాటికి లవ్ జిహాదే అని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో హిందూ అమ్మాయిలను వేధిస్తున్నారని అన్నారు. నిందితుడిని కాపాడేందుకు చిన్న సెక్షన్ల కింద కేసులు పెడతారన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎస్టీలు అంటే చిన్నచూపని.. కేసీఆర్ అగ్రవర్ణాలకే ముఖ్యమంత్రి అని మండిపడ్డారు.
నిందితుడు సైఫ్‌పై ర్యాంగింగ్‌తో పాటు లవ్ జిహాదీ కింద కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగిన సీఎం స్పందించట్లేదని ఫైరయ్యారు. అంతేకాకుండా ఈ కేసును నిర్వీర్యం చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని బండి ఆరోపించారు. కాగా, బండి సంజయ్ ఆరోపణలపై వరంగల్ సీపీ సీవీ రంగనాథ్ స్పందించారు. రాజకీయ ప్రయోజనాలో కోసం కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన తెలిపారు.






