మునావర్ ఫారుఖీని కేటీఆర్ పిలిపించాడు: Bandi Sanjay Kumar

by GSrikanth |   (  Updated:2022-08-25 06:45:41  IST  )

దిశ ప్రతినిధి, కరీంనగర్: మునావర్ ఫారూఖీని తీసుకొచ్చింది మంత్రి కేటీఆరేనని బండి సంజయ్ ఆరోపించారు.

మునావర్ ఫారుఖీని కేటీఆర్ పిలిపించాడు: Bandi Sanjay Kumar
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మునావర్ ఫారూఖీని తీసుకొచ్చింది మంత్రి కేటీఆరేనని బండి సంజయ్ ఆరోపించారు. గురువారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మునావర్ రాకుంటే తెలంగాణ ప్రశాంతంగా ఉండేదన్నారు. వివాదస్పద వ్యక్తులను పిలిపించిన కేటీఆరే ఇందుకు బాధ్యత వహించాలన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి అల్లర్లు సృష్టించాలని ప్లాన్ చేశాయని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ ఎత్తుగడలు వేస్తున్నాయని మండిపడ్డారు. శాంతి భద్రతలకు కాపాడాల్సిన సీఎం కేసీఆర్ శాంతి భద్రతల సమస్యను సృష్టించడం సిగ్గు చేటన్నారు. మేధావులు తెలంగాణలో కొనసాగుతున్న నిర్బంధాలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ తెలంగాణను శ్రీలంకలా ఊహించుకుంటున్నారని, ఇది ఆందోళనకర పరిణామమని వ్యాఖ్యానించారు. పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. అన్ని మతాలు బాగుండాలని బీజేపీ చెప్పే విషయాన్ని ముస్లింలు కూడా ఆలోచిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ కుయుక్తులను గమనించాలని సంజయ్ కోరారు.

Next Story