- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎగువమానేరులో చిక్కుకున్న ఐదుగురు పశువుల కాపరులు.. కలెక్టర్ ను అలర్ట్ చేసిన ఎంపీ బండి సంజయ్
by Muthe.Rajitha |
రాష్ట్రంలో నిన్నటి నుంసీజీ కురుస్తున్న ఎడతెరిపి లేని వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో నిన్నటి నుంసీజీ కురుస్తున్న ఎడతెరిపి లేని వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. అయితే సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లి ఐదుగురు పశువుల కాపరులు ఎగువ మానేరులో చిక్కుకున్నారు. కాగా తాము వరదలో చిక్కుకున్నట్టు కుటుంబసభ్యులకు తెలపగా.. వారు విషయాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ కి చేరవేశారు. ఎలాగైనా వారిని కాపాడమని వేడుకున్నారు.
స్పందించిన ఎంపీ బండి సంజయ్ కలెక్టర్ సందీప్ కుమార్ కు ఫోన్ చేసి.. వారిని రక్షించే ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేసారు. దీంతో అప్రమత్తం అయిన జిల్లా యంత్రాంగం.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది. వారిని కాపాడేందుకు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.
Next Story






