- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ భాష మార్చుకోవాలి.. లేకపోతే మా భాష తట్టుకోలేరు : ఎంపీ బలరాం నాయక్
మహాబూబాబాద్ సభలో కేటీఆర్ చేసిన కామెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మహాబూబాబాద్ సభలో కేటీఆర్ చేసిన కామెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ మండిపడ్డారు. కేటీఆర్ సీఎంపై చేసిన వ్యాఖ్యలు, వాడిన భాష సరిగా లేదని, ఆయన తన భాషను మార్చుకోవాలన్నారు. ఆదివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బలరాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణను కేసీఆర్ ఒక్కరే తీసుకురాలేదని, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా తాము సోనియాగాంధీని ఒప్పించి రాష్ట్రాన్ని తీసుకువచ్చామన్నారు. రేవంత్ రెడ్డి కష్టపడి జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగి సీఎం అయ్యారని, కేటీఆర్ వాళ్ల నాన్న కేసీఆర్ వల్ల రాజకీయాల్లో ఎదిగారని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ హాయాంలో రేవంత్ రెడ్డిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని, అన్ని తట్టుకొని రేవంత్ రెడ్డి రాజకీయాల్లో రాణిస్తున్నారని బలరాం నాయక్ తెలిపారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మరోసారి వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యేవారా, బీఆర్ఎస్ హాయాంలోనే తెలంగాణ ఐదు మండలాలను ఆంధ్రాకి ఇచ్చారని బలరాం నాయక్ ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు భాష మార్చుకోకపోతే వారు తాము మాట్లాడే భాషను తట్టుకోలేరన్నారు.






