- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి వారిని పక్కన పెట్టాలి.. ఈటల, బండి వివాదంపై MP అర్వింద్ షాకింగ్ కామెంట్స్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajender) మధ్య నెలకొన్న వివాదంపై ఎంపీ ధర్మపురి అర్వింద్(Arvind Dharmapuri) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajender) మధ్య నెలకొన్న వివాదంపై ఎంపీ ధర్మపురి అర్వింద్(Arvind Dharmapuri) స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంలో అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకోవాలని అన్నారు. వివాదంపై నోడల్ విచారణ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ ఎంపీకి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని అన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ఫలితం చూపించకపోతే పక్కనబెట్టాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభేదాలు అనేవి అన్ని పార్టీల్లో ఉంటాయని అన్నారు. కాంగ్రెస్‌లో కొండా సురేఖ దంపతులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, బీఆర్ఎస్‌లో కేటీఆర్, కవిత మధ్య వివాదాలు లేవా? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇప్పటికే ఈ అంశంపై పార్టీ నేతలు ఎవరూ చర్చించవద్దంటూ జాతీయ నాయకత్వం కీలక ప్రకటన చేసింది. అయినా అటు బండి సంజయ్.. ఇటు ఈటల రాజేందర్ ఓపెన్ గానే విమర్శలు చేసుకోవడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకొని సయోధ్య కూర్చుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.






