- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TRS హ్యాంగోవర్‍లోనే కవిత.. కొత్తపార్టీపై బీజేపీ ఎంపీ అర్వింద్ రియాక్షన్
'తెలంగాణ రాష్ట్ర సేన' పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ హ్యాంగోవర్‍లోనే కవిత బతుకుతున్నారని అందుకే పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కవితను మేమెప్పుడో మర్చిపోయామని నిన్నటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశాం ఇకపై పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారని అన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‍లో మీడియాతో మాట్లాడిన అర్వింద్.. కవిత ప్రకటించిన కొత్త పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కవిత రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే అని అన్నారు. మేం భరతమాతకు బానిసలం తప్ప లిక్కర్‍కు కాదన్నారు. కేసీఆర్ కవితకు రోబోలా కనిపిస్తున్నారా? రజనీకాంత్‍లా కనపడుతున్నారా? అని సెటైర్ వేశారు. బీజేపీ సపోర్టు లేకుండానే తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు. అతడి వ్యాఖ్యలను పింక్ బూతద్దాలను పెట్టుకుని చూడొద్దన్నారు.






