కేంద్ర మంత్రులు గడ్కరీ, అశ్విని వైష్ణవ్‌తో ఎంపీ అర్వింద్ భేటీ.. పలు సమస్యలపై విన్నపాలు

by Vemula.Srinu Prasad |

కేంద్ర మంత్రులు గడ్కరీ, అశ్విని వైష్ణవ్‌తో ఎంపీ అర్వింద్ భేటీ అయ్యారు...

కేంద్ర మంత్రులు గడ్కరీ, అశ్విని వైష్ణవ్‌తో ఎంపీ అర్వింద్ భేటీ.. పలు సమస్యలపై విన్నపాలు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ(Nitin Gadkari), అశ్విని వైష్ణవ్‌(Ashwini Vaishnav)తో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Nizamabad MP Dharmapuri Arvind) వేర్వేరుగా భేటీ అయ్యారు. నిజామాబాద్(Nizamabad), జగిత్యాల జిల్లాలకు చెందిన పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్‌(Nizamabad Railway Station)లో పిట్ లైన్‌ల ఏర్పాటు చేయాలని, అలాగే పార్లమెంట్ పరిధిలోనూ పలు రైళ్లను పొడిగించాలని, వందే భారత్ సహా పలు నూతన రైళ్ల మంజూరు చేయాలని, అయ్యప్ప భక్తుల కోసం కొల్లాంకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌(Union Minister, Union Minister for Railways Ashwini Vaishnav)ను కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.


మరోవైపు కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి గడ్కరీ‌కి సైతం వినతి పత్రం అందజేశారు. జగిత్యాల జిల్లాలో NH 61,63లలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు అంబారీపేట, అంతర్గాం గ్రామాల వద్ద ఫ్లైఓవర్‌ ఏర్పాటు, అండర్ పాసుల నిర్మాణాలను చేపట్టాలని విజ్. మంజూరుకు తక్షణమే మౌఖికంగా హామీ ఇచ్చి, సాంకేతికంగా సాంకేతికంగా మంజూరుకు తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

అనంతరం కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి దుర్గా దాస్ ఉయికే‌ను ఎంపీ సైతం కలిశారు. జగిత్యాల జిల్లాలో బోర్నపల్లి నుంచి జగన్నాథపూర్ వరకు హై లెవెల్ బ్రిడ్జిని చేపట్టాలని కోరారు. గిరిజన మంత్రిత్వ శాఖ ద్వారా నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు

Next Story