- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని కలిసిన ఎంపీ అర్వింద్
నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ ఆర్ఓబీ కి సంబంధించి 15 నెలలుగా పెండింగులో ఉన్న నిధుల కోసం రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో సోమవారం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కలిశారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ ఆర్ఓబీ కి సంబంధించి 15 నెలలుగా పెండింగులో ఉన్న నిధుల కోసం రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో సోమవారం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కలిశారు. ఆర్ ఓబీ కి సంబంధించిన సవరించిన నిధులు రూ. 8.68 కోట్ల కోసం మంత్రితో ఎంపీ విన్నవించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇందుకు మంత్రి కోమటి రెడ్డికి ఎంపీ అర్వింద్ ధర్మపురి ధన్యవాదాలు తెలిపారు.
Next Story






