- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MP Arvind: జూబ్లీహిల్స్ దొంగఓట్లు మీ పనే .. కేటీఆర్‍కు అర్వింద్ కౌంటర్
బీఆర్ఎస్ దేశ భద్రతకే ముప్పు అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ సింపతి రాజకీయాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) హాట్ కామెంట్స్ చేశారు. ఈ బై ఎలక్షన్స్ లో సింపతి అని మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) క్లబ్స్, పబ్స్ కు డ్రగ్స్ సరఫరా ఎవరి కనుసన్నుల్లో నడిచింది? ఆ లోకల్ నాయకుడు ఎవరు అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ (KTR) సమాధానం చెప్పాలన్నారు. సింపతి చూపాల్సింది ఎవరికి డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్లకా? లేక డ్రగ్స్ బాధితులకా అని ప్రశ్నిచారు. డ్రగ్స్ కేసుల్లో దొరికిన సెలబ్రెటీలను కేటీఆర్ విడిపించలేదా అని ప్రశ్నించారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన అర్వింద్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఓట్ల చోరీపై కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో దొంగఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ అని అర్వింద్ ఆరోపించారు. బీఆర్ఎస్ హాయంలో కేసీఆర్, కేటీఆర్ ఇష్టానుసారంగా దొంగ ఓట్లే కాదు ఏకంగా దొంగపాస్ పోర్టులు చేసిన దొంగలు మీరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ హయాంలో బోధన్‍లో ఒకే ఇంట్లో 42 దొంగ పాస్ పోర్టులు ఇచ్చింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో వెలుగు చూసిన దొంగఓట్లు బీఆర్ఎస్ హయాంలోనే ఎన్ రోల్ అయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఈ దేశ భద్రతకే ముప్పు అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో జిల్లా కలెక్టర్ జాగ్రత్తగా పని చేయాలని బిల్లులు ఆపొద్దని సూచించారు.






