- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యసభలో ‘మూసీ’పై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు.. బీజేపీపై విమర్శలు
రాజ్యసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ (MP Anil Kumar Yadav) సభలో ముసీ నది ప్రస్తావన తీసుకొచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ (MP Anil Kumar Yadav) సభలో ముసీ నది ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలోని ప్రధాన నదుల్లో (Musi River) మూసీ నది ఒకటని, దీన్ని ముచ్‌కుందా పేరుతో పిలచేవారని తెలిపారు. మూసీ నది వికారాబాద్ అనంతగిరి కొండల్లో మొదలై హైదరాబాద్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ వద్ద కృష్ణా నదిలో కలుస్తుందని వివరించారు. మూసీ నదికి ఎంతో చరిత్ర ఉందని, హైదరాబాద్ మూసీ నది ఓడ్డున నిర్మించారని చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో మూసీ నది నీరు తాగేవారని, ఎన్నో ఎకరాలకు నీళ్లు అందించిందని చెప్పారు. అయితే నేడు మూసీ నది పరిస్థితి దారుణంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో చెత్త, ఇండస్ట్రీయల్ కెమికల్స్ మూసీ నది వేస్తున్నారని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు ప్రతి సంవత్సరం జబ్బుల బారిన పడుతున్నారని వెల్లడించారు.
మూసీ నది ప్రక్షాళన నేపథ్యంలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. మూసీనదికి కేంద్రం నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారని వెల్లడించారు. మూసీ నదికి నిధులు కేటాయిస్తే ఆ నదికి పునర్జన్మ వచ్చినట్లు అవుతుందని తెలిపారు. కానీ నిధులు కేటాయించాలని ఎన్ని సార్లు వినతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని చెప్పారు. దీంతో అక్కడ డెవలప్ చేయడానికి కుదరడం లేదన్నారు. మూసీ నదిని డెవలప్ చేద్దామంటే.. బీజేపీ నేతలు నిరసనలు తెలియజేస్తారని వెల్లడించారు. ఎన్నికల సమయంలో బీజేపీ పెద్దలు హైదరాబాద్‌కి వచ్చి ప్రచారం చేస్తారని, కానీ ఒక్క నేత కూడా మూసీ నది పరిస్థితిపై మాట్లాడరని విమర్శించారు.






