కొన్నాళ్లు సినిమా అవార్డులు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-19 17:09:14  IST  )

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు.

కొన్నాళ్లు సినిమా అవార్డులు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో హైటెక్స్ వేదికగా జరుగుతున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా అవార్డులు కొన్నాళ్ల పాటు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. నటులకు అవార్డులు, పురస్కారాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అవార్డుల ప్రాముఖ్యతను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారని తెలిపారు.

సినిమా అవార్డులను మళ్లీ పునరుద్ధరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను ఎప్పుడు కలిసినా చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించే మాట్లాడుతారని గుర్తు చేశారు. దేశ జీడీపీ పెరగడానికి చిత్ర పరిశ్రమ ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. ఇండియన్ సినిమా అంటే.. తెలంగాణ గుర్తుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అంటారని మెగాస్టార్ తెలిపారు. కళాకారులను ఉత్సాహపరచడంలో పక్క రాష్ట్రం కొంత వెనుకంజలో ఉందన్నారు. సినిమా వాళ్లకు దగ్గరగా ఉండే చంద్రబాబు దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఏ బాధ్యత అప్పగించినా తాను బాధ్యత తీసుకుంటానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

Next Story