- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లిని కళ్లముందే కోల్పోయిన కొడుకు.. వేములవాడలో విషాదం
తన కుమారుడిని చూసేందుకు సుదూర గ్రామం నుంచి వచ్చిన తల్లి, కుమారుడి కళ్లముందే కుప్పకూలి కన్నుమూసింది.

దిశ, వేములవాడ టౌన్: తన కుమారుడిని చూసేందుకు సుదూర గ్రామం నుంచి వచ్చిన తల్లి, కుమారుడి కళ్లముందే కుప్పకూలి కన్నుమూసింది. ఈ ఘటన వేములవాడలో గురువారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జగిత్యాల జిల్లా పోలాస గ్రామానికి చెందిన నల్లూరి చందన (32), తన భర్తతో కలిసి వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి సాంస్కృత పాఠశాలలో హాస్టల్లో ఉంటున్న కుమారుడు నరేష్‌ను చూడటానికి వచ్చారు.
తల్లి ప్రేమగా కుమారుడితో మాట్లాడుతున్న క్షణాల్లోనే కళ్లు తిరుగుతున్నాయంటూ చెప్పి అక్కడే కూర్చుని, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ కోల్పోయిన ఆమెను తక్షణమే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.
తల్లి మరణ వార్త విని బాలుడి రోదించిన తీరు పక్కవారి చేతకూడ కన్నీరు పెట్టించాయి. ఆ తల్లి ఒడిలో పెరిగిన చిన్నారి, తన కళ్లముందే ఆమెను కోల్పోయిన తీరును అర్థం చేసుకోలేక శోక సముద్రంలో మునిగిపోయాడు. చందన అకస్మాత్తుగా చనిపోవడంతో కుటుంబంలోనే కాదు, పాఠశాలలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.






