మానవత్వమా నువ్వెక్కడా.! తల్లి మృతదేహం ముందు ఆస్తికోసం పోరు..

by Bhanu |

ఇటు తల్లి మరణం విషాదాన్ని మిగిల్చిందో లేదో, అటు ఆమె ఆస్తిపై జులుం మొదలెట్టిన అన్నదమ్ములు మానవీయ విలువల పతనాన్ని వెలుగులోకి తెచ్చారు.

మానవత్వమా నువ్వెక్కడా.! తల్లి మృతదేహం ముందు ఆస్తికోసం పోరు..
X

దిశ, వరంగల్: ఇటు తల్లి మరణం విషాదాన్ని మిగిల్చిందో లేదో, అటు ఆమె ఆస్తిపై జులుం మొదలెట్టిన అన్నదమ్ములు మానవీయ విలువల పతనాన్ని వెలుగులోకి తెచ్చారు. వరంగల్ నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులు తమ తల్లి మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచే తీరులో, ఆస్తి విషయంలో పరస్పరం వాదనకు దిగారు. మృతదేహం ఇంట్లో ఉండగానే ఆస్తి పంచుకోవాలని పట్టుబట్టి చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాండ్ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు.

తల్లి చనిపోయిన కొద్దిసేపటికే ఈ తీరుతో వ్యవహరించడం స్థానికులను, చూసిన వారందరిని కలిచివేసింది. "ఆస్తి ఎంతైనా వస్తుంది, కానీ తల్లిని తిరిగి తీసుకొచ్చే శక్తి ఏదికీ ఉండదు" అంటూ పలువురు మానవత్వం చీకట్లో మునిగిపోయిందని వాపోయారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



Next Story