Mother's love: తల్లి ప్రేమ వెలకట్టలేనిది.. బిడ్డ కోసం ఆటో వెంట ఆవు పరుగులు వైరల్

by Ramesh Naini |

ఎంతటి క్రూర జంతువులైనా, సాధు జంతువులనా.. తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రపంచంలో తల్లి ప్రేమ వెలకట్టలేనిదని చెబుతుంటారు.

Mothers love: తల్లి ప్రేమ వెలకట్టలేనిది.. బిడ్డ కోసం ఆటో వెంట ఆవు పరుగులు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral video) ఎంతటి క్రూర జంతువులైనా, సాధు జంతువులనా.. తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రపంచంలో తల్లి ప్రేమ (Mother's love) వెలకట్టలేనిదని చెబుతుంటారు. కొన్ని సార్లు జంతువులు తమ పిల్లలపై చూపించే ప్రేమను మనుషులు సైతం అలా చూపించలేరేమోనని కొన్ని సంఘటనలు చూస్తే సందేహాలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఓ తల్లి ఆవు (Mother cow) తన దూడపై చూపించిన ప్రేమ తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల పట్టణంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు.. మేత కోసం వెళ్ళింది. అనంతరం తల్లి ఆవు ఎంతకి తిరిగి రాకపోవడంతో లేగ దూడ అల్లాడిపోయింది. ఇది గమనించిన యజమాని నరేందర్ లేగ దూడను ఆటోలో ఎక్కించుకుని పట్టణం అంతా తల్లి ఆవు కోసం గాలించారు.

చివరికి కొత్త బస్టాండ్ వద్ద నరేందర్ ఆవును గుర్తించారు. ఇక ఆటోలో ఉన్న తన బిడ్డను చూసి తల్లి ఆవు ఎంతగానో మురిసిపోయింది. ఈ క్రమంలోనే ఆవును తిరిగి ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో బిడ్డకు పాలు ఇచ్చేందుకు ఆవు ఆటో వెంట పరుగెత్తింది. ఆటోను సైతం నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఆవుకు సహకరిస్తూ ఇంటికి చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో యజమానిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అమ్మ అంటే ఒక పదం కాదని, ఒక ఎమోషన్ అని, అమ్మ ప్రేమను వెలకట్టలేమని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Next Story