తల్లి, ఇద్దరు కూతుర్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

by Ratna Kumari |

మండల పరిధిలో ఎలిమినేడు అనుబంధ గ్రామమైన మేటిల గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ గుంటి అరుణ, ఆమె ఇద్దరు కూతుర్లు అభిజ్ఞ శ్రీ, విజ్ఞ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.

తల్లి,  ఇద్దరు కూతుర్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
X

దిశ, ఇబ్రాహీంప‌ట్నం : మండల పరిధిలో ఎలిమినేడు అనుబంధ గ్రామమైన మేటిల గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ గుంటి అరుణ, ఆమె ఇద్దరు కూతుర్లు అభిజ్ఞ శ్రీ, విజ్ఞ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఆడిటోరియంలో జరిగిన కీ బోర్డ్ ప్రదర్శన లో ఆగకుండా గంటసేపు పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఘనత సాధించారు. ఈవెంట్‌లో మొత్తం 22 దేశాలకు చెందిన 2000 మంది పోటీపడగా.. అందులో 777 మంది మాత్రమే విజేతలుగా నిలిచారు. విజేతలకు శనివారం గచ్చిబౌలి ఆడిటోరియంలో అగస్టిన్ దండింగ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఒకే గ్రామం నుంచి తల్లి, ఇద్దరు కూతుర్లు కలిసి గిన్నిస్ రికార్డ్ సాధించడం విశేషం. అంగన్‌వాడీ టీచర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వరల్డ్ రికార్డ్ సాధించిన అరుణ గ్రామస్తులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. గ్రామం పేరు ప్రపంచ స్థాయిలో నిలపడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాం" అని తెలిపారు. వీరి విజయంపై మేటిల గ్రామస్తులు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Next Story