సర్పంచ్ ఎన్నికల చిత్రాలు.. బరిలో తల్లీ కూతుళ్లు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.

సర్పంచ్ ఎన్నికల చిత్రాలు.. బరిలో తల్లీ కూతుళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో ఓ విచిత్ర సంఘటన నమోదైంది. జగిత్యాల జిల్లా తిప్పయ్యపల్లెలో సర్పంచ్ పదవి కోసం తల్లీబిడ్డలు ఢీ అంటే ఢీ అంటున్నారు. తిప్పయపల్లె గ్రామపంచాయితీ ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. కాగా బీఆర్ఎస్ మద్దతుతో శివరాత్రి గంగవ్వ బరిలోకి దిగారు. అయితే ఆమె కూతురు సుమలత కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల్లోకి దిగింది. ఒకే ఇంటి నుంచి తల్లీ కూతుర్లు ఇలా వేర్వేరు పార్టీల మద్దతుతో పోటీ పడటం వెనక ఓ ఆసక్తికర విషయం కూడా ఉంది.

గంగవ్వ కూతురు సుమలత కొంతకాలం క్రితం అదే గ్రామంలోని ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె ప్రేమ పెళ్లిని వ్యతిరేకించిన తల్లిదండ్రులు అప్పటి నుంచి ఆమెపై గుర్రుగా ఉన్నారు. రెండు కుటుంబాల మధ్య వైరం కొనసాగుతుండగా.. తల్లి ఎన్నికల్లో పోటీ చేస్తోందని తెలిసిన సుమలత.. తల్లిపై పోటీకి దిగగా.. ఆమెకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. మరి ఈ తల్లీకూతుళ్ల సమరంలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

Next Story