- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగామలో పసిబిడ్డ కలకలం.. తల్లిదండ్రులకు 'పేగు బంధం' బరువైందా.?
by Bhanu |
కన్నపేగు బంధాన్ని తెంచుకుంటూ ఓ తల్లి తన పసికందును రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయింది.

X
దిశ, జనగామ : కన్నపేగు బంధాన్ని తెంచుకుంటూ ఓ తల్లి తన పసికందును రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయింది. రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో సమీపంలోని స్థానికులు వెంటనే అటువైపు వెళ్లారు. రోడ్డు పక్కన వదిలేసి ఉన్న ఆ బిడ్డను చూసి చలించిపోయారు. గ్రామస్తుల్లోని ఒక వృద్ధురాలు ఆ చిన్నారిని చేరదీసి, స్నానం చేయించి సంరక్షించింది. ఎంత వెతికినా చుట్టుపక్కల ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎవరూ కనిపించలేదు.
పసిబిడ్డను కావాలనే వదిలేసి వెళ్లారని నిర్ధారించుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసికందును వదిలి వెళ్లిన తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Next Story






