- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC Tax : జీహెచ్ఎంసీ పన్ను బకాయిదారుల్లో పెద్దోళ్లే ఎక్కువ !
జీహెచ్ఎంసీ పన్ను(GHMC Tax)బకాయిదారు(Defaulters)ల్లో బడా పారిశ్రామిక వేత్తలు, సంపన్నవర్గాల(Industrialists, High Income Earners) వారే అధికంగా ఉన్నట్లుగా వెలువడిన కథనాలు ఆసక్తిరేపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : జీహెచ్ఎంసీ పన్ను(GHMC Tax)బకాయిదారు(Defaulters)ల్లో బడా పారిశ్రామిక వేత్తలు, సంపన్నవర్గాల(Industrialists, High Income Earners) వారే అధికంగా ఉన్నట్లుగా వెలువడిన కథనాలు ఆసక్తిరేపుతున్నాయి. సాధారణ రైతు..చిరు వ్యాపారుల రుణ, పన్ను బకాయిలపై అధికార దర్పంతో బలవంతపు వసూళ్లకు, జప్తులకు దిగే బ్యాంక్లరు, అధికారులు బడా బాబుల మొండిబకాయిల వసూళ్లకు ఆ స్థాయిలో తమ ప్రతాపం చూపడంలో వెనుకడుగు వేస్తుంటారు. జీహెచ్ఎంసీకి అధిక ఆదాయ దారులకు చెందిన వారే కోట్ల రూపాయల పన్నులను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఏళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో అవి వందల కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు నిర్ధారించారు.
ప్రస్తుతం గ్రేటర్ లో 19.5లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వారి నుంచిజీహెచ్ఎంసీకి రూ.11,668కోట్ల ప్రాపర్టీ టాక్స్ రావాల్సి ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4వేల ఆస్తులకు సంబంధించి రూ.5వేల కోట్ల బకాయిలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 600ప్రాపర్టీలకు సంబంధించ రూ. 500కోట్లకు పైగా బకాయిలు వసూలు కావాల్సి ఉంది. అవన్ని పోగా ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి రూ.6వేల కోట్ల ప్రాపర్టీ టాక్స్ వసూలు జరుగాల్సి ఉంది. 2.50లక్షల మంది కమర్షియల్, 17లక్షల మంది రెసిడెన్షియ్ టాక్స్ చెల్లిస్తున్నారు.
6లక్షల మంది నుంచి రూ.5 లక్షలకు పైన ఉన్న బకాయిల విలువ ఏకంగా రూ.860 కోట్లని అధికారులు తేల్చారు. పన్నుల వసూళ్ల కోసం ఒక్క ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే 100 మందికి రెడ్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నోటీసులకు స్పందించకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తామని బల్దియా అధికారులు హెచ్చరించారు. ఈ నెల 18నుంచి వారంట్లు జారీ చేస్తున్నారు. మార్చి 29వరకు వసూళ్ల డ్రైవ్ చేపట్టనున్నారు.
ఆస్తి పన్ను కట్టని ప్రముఖుల్లో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బకాయి రూ.5.50 కోట్లు..అలాగే జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి విలువ రూ.52 కోట్లని, ఎల్ అండ్ టీ మెట్రో రైలు బకాయి రూ.32 కోట్లని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ రూ.30 కోట్లు చెల్లించాలని, ఇండో అరబ్ లీగ్ రూ.7.33 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. సోమాజిగూడలోని కత్రియా హోటల్ రూ.8.62 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి పన్నులు చెల్లించాలని తెలిపారు. వారికి రెడ్ నోటీసులు జారీ చేసినట్లుగా జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ బంజారా రెండేండ్లుగా పన్ను చెల్లించకపోవడంతో ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు. రూ.1.43 కోట్ల పన్ను బకాయి చెల్లించాలని రెడ్ నోటీసు ఇచ్చారు. బకాయిదారులంగా వీరంతా తాము జారీ చేసిన రెడ్ నోటీసులకు స్పందించాలని, లేకుంటే ఆస్తులను సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.






