రెండు వందల చర్చల్లో మూడు వందలకు పైగా ప్రశ్నలు సంధించారు!.. ఎంపీ అభ్యర్ధిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 5 |
రెండు వందల చర్చల్లో మూడు వందలకు పైగా ప్రశ్నలు సంధించారు!.. ఎంపీ అభ్యర్ధిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు వందల చర్చల్లో పాల్గొని.. మూడు వందలకు పైగా ప్రశ్నలు సంధించారని ఎంపీ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ తరపున మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉండగా ఆయనకు సపోర్టుగా కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ఆయన చేసిన అభివృద్దికి సంబందించిన వీడియోను పోస్ట్ చేశారు.

శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని, రైల్వే స్టేషన్ల సుందరీకరణ, కొత్త రైల్వే లైన్లు, రైల్వే బ్రిడ్జీల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు తన హయాంలో సాధించారని తెలిపారు. లోక్ సభలో సుమారు రెండు వందల చర్చల్లో పాల్గొని.. మూడు వందలకు పైగా ప్రశ్నలు సంధించారిని తెలియజేశారు. అంతేగాక ఎంఎస్ఎన్ ఫౌండేషన్ ద్వారా కరోనా కష్టకాలంలో, ఇతర సమయాల్లో నిరుపేదలకు అండగా నిలిచారని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల అసమర్థత వల్ల వెనుకపడేయబడ్డ పాలమూరు ప్రాంతం.. బీఆర్ఎస్ పరిపాలనలో సుభిక్షంగా మారిందని, మహబూబ్‌నగర్ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డ గులాబీ జెండా.. ఈ గడ్డపై మరోసారి ఎగరాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి, పాలమూరు ముద్దుబిడ్డ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మహబూబ్ నగర్ ప్రజలపై ఉందని చెబుతూ.. మన్నె శ్రీనివాస్ రెడ్డి గారి గళం.. మహబూబ్‌నగర్‌కి బలం అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Next Story

Most Viewed