- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Alert: హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్తానీయులు
ఇండియా(India), పాకిస్తాన్(Pakistan) మధ్య యుద్ధ వాతావరణం ముదురుతున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు విధించుకుంటున్న పరస్పర ఆంక్షలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా(India), పాకిస్తాన్(Pakistan) మధ్య యుద్ధ వాతావరణం ముదురుతున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు విధించుకుంటున్న పరస్పర ఆంక్షలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఫోన్ మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీయుల(Pakistani) వివరాలు సేకరించాలని ఆదేశించారు. పాకిస్తాన్ వాసులను వెనక్కి పంపించే అంశంలో కేంద్రానికి సపోర్ట్ చేయాలని కోరారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో దాదాపు 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి.. వారిని వెనక్కి పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
మరోవైపు ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారత్ తగిన ఆధారాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను వివిధ దేశాలకు చెందిన విదేశీ కార్యదర్శులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ(Department of Foreign Affairs) అందజేసింది. మరోవైపు భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్తానీయులు 48 గంటలలోపు దేశం విడిచివెళ్లాలంటూ కఠిన ఆదేశించింది. దీంతో ఇప్పటికే భారత్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న పాకిస్థానీయులు.. స్వదేశం వెళ్లేందుకు అటారీ సరిహద్దు వద్ద క్యూ కట్టారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది.
హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025
పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ
ఈ విషయమై ఆయా రాష్ట్రాల… pic.twitter.com/BBMhb5RTIj






