- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ విగ్రహం ఏర్పాటు ఆపండి.. మీనాక్షికి మూసీ జన్ ఆందోళన్ లేఖ
గాంధీ సరోవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్కు మూసీ జన్ ఆందోళన్ లేఖ రాసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ నది ఒడ్డున తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్కు మూసీ జన్ ఆందోళన్ (MJA) లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్ గ్రామంలో 10.34 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సంకల్పించిందని దీని వల్ల మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్స్ నివాసులను ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం అదనంగా తెలంగాణ ప్రభుత్వం98.20 ఎకరాల రక్షణ శాఖ భూమిని బదిలీ చేయమని కోరడంతో పాటు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాథ్ సింగ్ ను గత నెల 12న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారని ప్రజల వ్యతిరేకతను, ప్రజాస్వామ్య ప్రక్రియలను పట్టించుకోకుండా ఇలా చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు.
అధిష్టానానికి తెలియజేయండి:
ప్రతిపాదిత మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగమైన 'గాంధీ సరోవర్ ప్రాజెక్ట్' విషయంలో మేము తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నామమి. సివిల్ సొసైటీ కార్యకర్తలు, పర్యావరణవాదులు, మానవ హక్కుల సంస్థలు, స్థానిక నివాసితులతో కూడిన ఈ నెట్వర్క్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని వెంటనే ఆపాలని, ప్రజాస్వామ్య చర్చల ద్వారా పూర్తి సమీక్ష చేయాలన్నారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని మీనాక్షి నటరాజన్‌ను కోరారు. విగ్రహం ఏర్పాటును మహాత్మా గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని లేఖలో ప్రస్తావించారు. 2013 భూసేకరణ చట్టం కింద సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుండి ఈ ప్రాజెక్ట్‌కు మినహాయింపు ఇవ్వడాన్ని ఎంజేఏ ఖండిస్తోందిని 2017లో రాష్ట్ర సవరణ ద్వారా ఈ చట్ట ఉద్దేశాన్ని, ప్రజల ప్రయోజనాలను, ఆహార భద్రతను దెబ్బతీస్తున్నారని పేర్కొంది. ప్రస్తుత విధానం నది పర్యావరణ వ్యవస్థకు, తెలంగాణ సమాజానికి శాశ్వత హానికర పరిణామం హెచ్చరిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత రూపంలో కొనసాగితే మన సహజ వారసత్వానికి తిరిగి రాని నష్టం కలిగిస్తుందని గుర్తించాలన్నారు. స్థానిక ప్రజలలో ఉన్న ఈ అసంతృప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేయాలని మీనాక్షిని కోరారు.





