- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYDRA: హైడ్రా ఆధ్వర్యంలోనే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పిలిచిన టెండర్లు వివాదాస్సదం కావడంతో

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పిలిచిన టెండర్లు వివాదాస్సదం కావడంతో మాన్ సూన్ ప్రీప్రేర్డ్ నెస్ పేరుతో ఆ బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కోసం హైడ్రా ఆధ్వర్యంలో కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పిలిచిన టెండర్లలో ఏమేమి స్పెఫికేషన్స్ ఉన్నాయి? ఎందుకు వివాదాస్పదంగా మారాయి? ఏవిధమైన లోపాలున్నాయి? చర్చించడంతోపాటు జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాల సహకారంతో హైడ్రా ఆధ్వర్యంలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
130 మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్
జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాల నేపథ్యంలో తీసుకున్న చర్యలు, ఆపరేషన్స్ కోసం 130మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కోసం టెండర్లు పిలవనున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 150వార్డులకుగాను 9ఫ్యాకేజీలు టెండర్లు పిలవడంతోపాటు కాంట్రాక్టర్లు వ్యతిరేకించారు. సర్కిల్ స్థాయిలో పిలవాలని డిమాండ్ చేశారు. కానీ హైడ్రా మాత్రం 130టీమ్స్ కోసమే టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఇప్పటికే హైడ్రా పరిధిలో 51డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. మొత్తం 181టీమ్స్ అవుతున్నాయి. 150వార్డులకు ఒక్కొక్కటిగా చొప్పున కేటాయించడంతోపాటు మిగిలిన 30 టీమ్స్ ను సర్కిల్ కు ఒకటి చొప్పున కేటాయించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వార్డు స్థాయిలో ఉన్న టీమ్స్ కు ఉన్న ఎమర్జెన్సీ ఎక్విప్ మెంట్స్ కంటే సర్కిల్ స్థాయిలోని టీమ్స్ కు అదనంగా ఉండే అవకాశమున్నట్టు తెలిసింది. జోనల్ స్థాయిలో, హెడ్ ఆఫీసు స్థాయిలో ఉండేవిధంగా కసరత్తు చేస్తున్నారు. సంభవించే విపత్తు ఆధారంగా మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ను సిద్దం చేయాలని హైడ్రా భావిస్తున్నట్టు సమాచారం.
రెండు రోజుల్లో టెండర్లు
వర్షాకాలంలో నగరాన్ని వరద ముంచెత్తకుండా హైడ్రా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు 130 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ను సమాయత్తం చేస్తోంది. ఒక్కో టీంలో 12 మంది ఉండేవిధంగా రూపొందించనున్నారు. ఈ ఎమర్జెన్సీ బృందాలకు హైడ్రాకు చెందిన 51 డీఆర్ఎఫ్ బృందాలు కూడా తొడవుతున్నాయి. ఒక్కో డీఆర్ఎఫ్ బృందంలో 15 మంది చొప్పున ఉంటారు. ఈ రెండు బృందాలు సమన్వయంతో పని చేసేలా హైడ్రా అధికారులు దిశానిర్దేశం చేయనున్నారు. ఎక్కడ నీరు నిలుస్తోందో అక్కడ ఈ బృందాలు పనిచేస్తాయి. వరద ముప్పును తొలగించి వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. అలాగే నివాసప్రాంతాల్లో వరద నిలవకుండా చూస్తుంది. వీటికి సంబంధించిన టెండర్లను రెండు రోజుల్లో పిలవనున్నట్టు హైడ్రా అధికారులు చెబుతున్నారు.
పూడిక తీత బాధ్యత బల్దియాకే
వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యతలను హైడ్రాకు అప్పగించిన విషయం విదితమే. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల విధుల పర్యవేక్షణ హైడ్రా పరిధిలోకి వచ్చింది. మురుగు కాలువల్లో చెత్త, పూడిక తీసే పనులు మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలోనే కొనసాగుతాయని నిర్ణయించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి సంయుక్తంగా విపత్తులను ఎదుర్కొవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మూడు విభాగాలతో ఇలంబర్తి సమావేశం
వర్షాకాలం నేపథ్యంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో సచివాలయంలో మెట్రోపాలిటన్, అర్బన్ డవలప్ మెంట్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లు, పూడికతీత పనుల గురించి చర్చించారు. మూడు విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.






