- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rythu Bharosa : అకౌంట్లలోకి నేటి నుంచి తిరిగి రైతుభరోసా డబ్బులు : మంత్రి తుమ్మల
రైతు భరోసా(Rythu Bharosa)డబ్బుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Thummala Nageswara Rao) శుభవార్త చెప్పారు. ఇటీవల అగిన రైతు భరోసా నిధుల జమ(Deposit of Funds)ను తిరిగి ఈ రోజు(Today) నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తుమ్మల వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్ : రైతు భరోసా(Rythu Bharosa)డబ్బుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Thummala Nageswara Rao) శుభవార్త చెప్పారు. ఇటీవల అగిన రైతు భరోసా నిధుల జమ(Deposit of Funds)ను తిరిగి ఈ రోజు(Today) నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తుమ్మల వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలోకి ఇవ్వాళ్టి నుంచి రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నట్లుగా తెలిపారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26నుంచి రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు సాయం అందజేస్తుంది. మార్చి 31 నాటికి రైతు భరోసా సహాయం రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల్లో రైతు భరోసా సహాయం పంపిణీ నిలిచిపోయింది. దీంతో రైతులకు పెట్టుబడి సహాయం అందడంతో జాప్యం నెలకొంది. అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..రైతు భరోసా లబ్ధిదారులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియ్యగానే ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది.
అయితే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి ఆన్ గోయింగ్ స్కీమ్ కింద రైతు భరోసా కొనసాగింపుకు ఎవరికి అభ్యంతరం లేకపోవడంతో ఎన్నికల సంఘం కూడా ఇందుకు అభ్యంతరం పెట్టలేదని తెలుస్తోంది. దీంతో రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను కొనసాగిస్తుందని సమాచారం.
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. సొంత నియోజవకర్గం కొండగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ నాలుగు పథకాలను ప్రారంచించారు. ఆ మరుసటి రోజే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో రైతు భరోసాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తిరిగి రైతు భరోసా సహాయం పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.






